
ప్రజాశక్తి-మైలవరం (ఎన్‌టిఆర్) : దసరా మహౌత్సవాన్ని పురస్కరించుకొని గత తొమ్మిది రోజులుగా చేస్తున్న ఉత్సవాలు సోమవారంతో ముగిశాయి. మైలవరంలోని కోట వెనుక ఉన్న కోట మహాలక్ష్మి ఆలయంలోని అమ్మవారిని మంత్రి జోగి రమేష్ ఈరోజు దర్శించుకున్నారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దంపతులు జమ్మి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితోపాటు ద్వారకా తిరుమల దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త ఎస్విఎన్ నివృతరావు పాల్గొన్నారు. ఈటు పోటు, బేతాళ ఊరేగింపు, కోలాటం, తీన్మార్, బేతాళ నృత్యం, కాళికా డాన్స్, అఘోర డాన్స్, చిత్ర విచిత్ర బుట్ట బొమ్మలు, ఆర్కెస్ట్రా సినీ పాటలతో , విద్యుత్ దీపాలతో అలంకరించిన ట్రాక్టర్ల పై అమ్మవారిని, సాయిబాబా, శివుడు, వివిధ వేషధారణలతో మైలవరం పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.