
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం నడిబడ్డున నెక్లెస్ రోడ్డులో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నీరా కేఫ్‌ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఆయన తనయుడు జోగి రాజీవ్ మంగళవారం సందర్శించారు. ప్రకృతి సిద్ధమైన, స్వచ్ఛమైన నీరాను రాష్ట్ర ప్రజలకు అందించడం పట్ల మంత్రి జోగి రమేష్ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించారు.ఈ నీరా కేఫ్‌ను సందర్శించడానికి వచ్చిన మంత్రి జోగి రమేష్‌కు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి రమేష్‌ను శ్రీనివాస్ గౌడ్ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా నీరా కేఫ్‌లో లభ్యమవుతున్న ఉత్పత్తుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ చలనచిత్ర నటుడు తల్వార్ సుమన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్య ప్రజా ప్రతినిధులు నాయకులు, గౌడ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.