Nov 10,2022 07:38

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక 31 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలను ఇచ్చామని, 20 లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఇస్తున్నామని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ తెలిపారు. టిడిపి ప్రభుత్వ హాయంలో ఒక్కరికైనా ఇంటి స్థలమిచ్చారా అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఆయన ప్రశ్నించారు. బుధవారం నాడు తాడేపల్లిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ పక్క రాష్ట్రంలో వుంటూ జగన్‌ ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. రాష్ట్రంలో గృహనిర్మాణ పనుల పురోగతిపై చర్చకు రావాలని డిమాండ్‌ చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలనకు ఇచ్చినా ప్రత్యక్షంగా చూపుతానని అన్నారు.