Oct 08,2023 10:20

ప్రజాశక్తి-కర్నూలు: మంత్రి గుమ్మనూరు జయరాం ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆలూరులో ఆయన మాతృమూర్తి శారదమ్మ(79) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గతంలో 'గుమ్మనూరు' గ్రామ సర్పంచ్‌గా ఆమె సేవలందించారు. ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం, వారి స్వగ్రామమైన గుమ్మనూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.