Jun 05,2023 14:33

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఉండవని, సాధారణ ఎన్నికలతోపాటు పార్లమెంటుకు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ముందస్తు అనే ఆలోచనే వైసిపికి లేదన్నారు. చంద్రబాబు రాజకీయంగా అంగవైకల్యంతో బాధపడుతున్నారని, అందుకోసమే ఇతర రాజకీయ పార్టీలతో పొత్తుల కోసం ఆరాటపడుతున్నారని విమర్శించారు. అందులో భాగంగానే ఢిల్లీకి వెళ్లి అమిత్‌షాను కలిశారని ఆరోపించారు. జనసేన, పవన్‌ కల్యాణ్‌ గురించి మాట్లాడదలచుకోలేదని పేర్కొన్నారు. ఏ ఎన్నికలైనా తాము ఒంటరిగా వెళ్తామని తెలిపారు.