ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : వైసిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై రాష్ట్ర ప్రజలు విశిష్ట స్పందన చూపిస్తున్నారని రాబోయే రోజుల్లో మళ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినే సిఎం అవ్వాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ అన్నారు. మంగళవారం కశింకోటలో జరిగిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అమర్నాథ్ కు పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మళ్ళ బుల్లి బాబు ఆధ్వర్యంలో కసింకోట సచివాలయం 4 కుమ్మరి వీధి శివాలయం, కోమాటవీధి, ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమర్నాథ్ ప్రతి గడపగడపకు వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాల గురించి వివరించారు. అర్హులైన ప్రతివారికి సంక్షేమ పథకాలు అని అన్నారు. వడ్డీవీధి లో 30 లక్షల రూపాయలతో రక్షిత మంచినీటి సరఫరా వాటర్ ట్యాంక్ ప్రారంభోత్సవం చేశారు. పంచాయతీ కార్యాలయం దగ్గర శ్రీస్వామి వివేకానంద విగ్రహ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ కలగా లక్ష్మి గున్నయ్య నాయుడు, గ్రామ సర్పంచ్ మంత్రి జయరజని, జడ్పిటిసి దంతులూరి శ్రీధర్ రాజు, వైస్ ఎంపీపీ పెంటకోట జ్యోతి, గ్రామ ఉపసర్పంచ్ నడిపల్లి లక్ష్మి నాయుడు, ఎంపీటీసీ చేవ్వేటి చంద్రమ్మ, మంత్రి పీటర్ వైజ మెన్ ఎంపీటీసీలు, వార్డ్ మెంబర్లు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.










