ప్రజాశక్తి- గుడివాడ : దేవాలయ గోపుర శిఖరంపై ఉన్న బంగారు కలశం అదృశ్యమైన ఘటన కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది. గుడివాడలోని సిద్ధాంతం గ్రామ శివాలయంలోని బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో ఈ ఘటన వెలుగు చూసింది. సుమారు 12 ఏళ్ల క్రితం ఆలయ ధర్మకర్తలు గోపురంపై ఉన్న రెండు శిఖరాలకు కిలో చొప్పున బరువుగల రెండు కలశాలను ఏర్పాటు చేశారు. అయితే, శనివారం అమ్మవారి ఆలయాన్ని పర్యవేక్షించేందుకు వచ్చిన వ్యక్తి కలశం లేకపోవడాన్ని గుర్తించి ఆలయ ధర్మకర్తలకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై పరిస్థితిని సమీక్షించారు.