బహుళజాతి కార్పొరేట్ సంస్థలు భారీ ఆదాయాలను ఆర్జిస్తున్నప్పటికీ.. మందగమన భయాలను సాకుగా చూపుతూ.. మరింత పొదుపు చర్యలకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలోనే గతేడాది చివరి నుంచి వరుసగా ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. తాజాగా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మళ్లీ లేఆఫ్‌లకు తెరలేపింది. వేలాదిమంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్దం చేసింది. పదివేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ఈ ఏడాది జనవరిలో ప్రకటించింది. అయితే, చెప్పినదానికంటే మరింత ఎక్కువ మందిపై వేటేయనున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆర్థిక సంవత్సరం తొలి వారంలోనే ఉద్యోగుల తొలగింపు ప్రారంభం కానుందని నిన్న ప్రకటించింది. క్లౌడ్ కంప్యూటింగ్ బిల్లులో డబ్బును ఆదా చేసుకునేందుకే లేఆఫ్‌లు ప్రకటిస్తున్నట్టు తెలిపింది.










