Feb 16,2023 13:45

న్యూఢిల్లీ : ఇంటర్నెట్‌ ప్రపంచంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన బ్రౌజింగ్‌ యాప్‌ 'ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌' శకం ముగిసింది. విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ డివైజ్‌లపై ఫైనల్‌ అప్‌డేటెట్‌ వెర్షన్‌ను 'ఐఈ11'ను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్టు మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. కొత్త బ్రౌజర్‌ మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ అప్‌డేట్‌ చేయడం ద్వారా పాత బ్రౌజర్‌ను నిలిపివేసింది. 1995లో ప్రారంభమైన ఇంటర్నెట్‌ ఎక్స్‌ప్లోరర్‌ 28 ఏళ్లు పాటు ఇంటర్నెట్‌ వినియోగదారులకు సేవలందించింది.