Jul 16,2023 21:36
  • 20 వరకు నిషేధం పొడిగించిన మణిపూర్‌ ప్రభుత్వం
  • పలు సంస్థలు, ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలకు ఇక్కట్లు

ఇంఫాల్‌ : జాతి హింసతో అల్లర్లు చెలరేగిన ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో గత 73 రోజులుగా ఇంటెర్నెట్  లేదు. అక్కడి బీజేపీ ప్రభుత్వం ఇంటరొట్‌ బ్యాన్‌ను విధించింది. అయితే ఈ నిషేధానిు అక్కడి సర్కారు మరో ఐదు రోజులు పొడిగించింది. దీంతో ఇంటరొట్‌ బ్యాన్‌ రాష్ట్రంలో ఈనెల 20 వరకు కొనసాగనున్నది. హింసాత్మక ఘటనలు, దాడులు, ఇండ్లకునిప్పు పెడుతును ఘటనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని రాష్ట్ర డీజీపీ సమర్పించిన నివేదికలో వెల్లడైందనిఈనెల 15న జారీ చేసిన నోటిఫికేషన్‌లో రాష్ట్ర హౌం శాఖ కమిషనర్‌ టి. రంజిత్‌ సింగ్‌ వివరించారు. ఇంటరొట్‌ లేకపోవటంతో అక్కడి సంస్థలతో పాటు ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకుగురవుతునాురు. రాష్ట్రంలో ఇంటరొట్‌ సదుపాయానిు పునరుద్ధరించాలని అనేక సంస్థలు, ప్రజలు మణిపూర్‌ హైకోర్టుతో పాటు దేశ సర్వోనుత న్యాయస్థానానిు సైతం ఆశ్రయించారు.

  • హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం

కొనిు ప్రాంతాల్లో పరిమిత ఇంటెర్నెట్ కు అనుమతినిస్తూ గత నెల 16న మణిపూర్‌ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, దాదాపు నెల తర్వాత ఈనెల 7న ఇంటరొట్‌ కనెక్షన్లపై నిషేధానిు ఎత్తివేయాలంటూ మరోసారి రాష్ట్ర ప్రభుత్వానిు మణిపూర్‌ హైకోర్టు ఆదేశించింది. అయితే, హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. పిటిషన్‌ విచారణకు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డి.వై చంద్రచూడ్‌, న్యాయమూర్తి జస్టిస్‌ పి.ఎస్‌. నరసింహ లతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. నేడు (సోమవారం) ఈ పిటిషన్‌ను న్యాయస్థానం విచారించనున్నది.