Apr 19,2023 21:10
  • డిస్నీలోనూ 15% మందికి ఉద్వాసన
  • విప్రోలో ఫ్రెషర్లకు గడ్డుకాలం

వాషింగ్టన్‌ : ఆర్థిక సంక్షోభ భయాలతో దిగ్గజ టెక్‌ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసనలు పలుకుతూనే ఉన్నాయి. తాజాగా మెటా, వాల్డ్‌ డిస్నీలు భారీ మొత్తంలో తొలగింపులకు సంకేతాలు ఇవ్వగా.. విప్రో ప్రెషర్లపై వేటుకు సిద్దం అయ్యింది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ మాతృసంస్థ అయినా మెటా మరోసారి వేలాది ఉద్యోగులను ఇంటికి పంపించే చర్యలకు దిగుతోందని సమాచారం. ఈ దఫా 10,000 మంది ఉద్యోగులకు కోత విధించనుందని బ్లూమ్‌బర్గ్‌ తాజాగా రిపోర్ట్‌ చేసింది. ఒక్కటి, రెండు రోజుల్లోనే దీనిపై అధికారికంగా ప్రకటన వెలుపడే సూచనలున్నాయి. ఇంతక్రితం మార్చిలో 10వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు మెటా సిఇఒ మార్క్‌ జుకర్‌ బర్గ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగానే ప్రస్తుత నిర్ణయం. బ్లూమ్‌బర్గ్‌ రిపోర్ట్‌ ప్రకారం.. సంస్థ పునర్నిర్మాణంలో భాగంగా ఈ కఠిన నిర్ణయం తీసుకోక తప్పడం లేదని జుకర్‌ బర్గ్‌ పేర్కొన్నారు. తొలగింపు అంశంపై మేనేజర్లకు మెటా సమాచారం కూడా ఇచ్చింది. ఉద్యోగులు ఇంటిబాట పట్టడానికి సిద్దపడి ఉండాలని తెలిపింది. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వర్చువల్‌ రియాలిటీ సంస్థ రియాలిటీ ల్యాబ్స్‌, క్విస్ట్‌ హార్డ్‌ వంటి విభాగాల్లోని ఉద్యోగులకు ఉద్వాసన పలికే అవకాశం ఉందని తెలుస్తోంది. గతేడాది నవంబరులో 13 శాతానికి సమానమైన 11,000 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఇప్పటికే కొత్త నియామకాల్ని దాదాపు నిలిపివేసింది. ప్రకటనల ఆదాయం తగ్గడంతో పాటుగా ప్రతికూల వ్యాపార పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగులను తొలగించాల్సి వస్తుందని మెటా పేర్కొంది.
అమెరికాకు చెందిన ప్రముఖ వినోద సంస్థ వాల్ట్‌ డిస్నీ దాదాపు 15 శాతం మంది ఉద్యోగులను తొలగించనుంది. వచ్చే వారం ఆ సంస్థ ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలోఉద్వాసనలు ఉండనున్నాయని తెలిపింది. ఏప్రిల్‌ 24 నాటికి తొలగింపులపై సిబ్బందికి స్పష్టమైన సమాచారం చేరవేస్తామని ఆ వర్గాలు తెలిపాయి. ఆ సంస్థ 2023 ఫిబ్రవరిలోనే ఏడు వేల మంది ఉద్యోగులను తీసేసింది. తాజాగా మరో విడత తొలగింపు ప్రకటనతో ఆ కంపెనీ ఉద్యోగులు తీవ్ర ఆందోళన నెలకొంది.
భారత దిగ్గజ ఐటి కంపెనీల్లో ఒక్కటైన విప్రో తన ఫ్రెషర్లకు ఎసరు పెట్టే యోచనలో ఉందని తెలుస్తోంది. దాదాపు 15 నెలలకు పైగా ంచే పనిలో ఉఆన్‌బోర్డింగ్‌ కోసం ఎదురుచూస్తున్న ఫ్రెషర్‌లకు మరో పరీక్ష విధించడం ద్వారా అనేక మందికి ఉద్వాసన పలకనుందని రిపోర్టులు వస్తోన్నాయి. ఈ తరహా పరీక్షను ఇప్పటికే ప్రెషర్లు ఎదుర్కొన్నప్పటికీ.. మరోసారి ఈ చర్యకు దిగడం గమనార్హం. ఇటీవల ఫ్రెషర్లకు ఇచ్చే వేతనాలను రూ.6.5 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు కోత పెట్టింది.