ముంబయి : ఎయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లో ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ విలీనం కానుంది. దీనికి పలు అనుమతులు లభిస్తే 2024 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుందని ఎయు ఎస్‌ఎఫ్‌బి పేర్కొంది. తాజా ఒప్పందంతో ఫిన్‌కేర్‌లో ఉన్న ప్రతి 2,000 షేర్లకుగానూ ఎయు ఎస్‌ఎఫ్‌బిలో 579 షేర్లు వాటాదారులకు లభిస్తాయి. ఈ ప్రక్రియ పూర్తయితే ఫిన్‌కేర్ వాటాదారులకు ఎయులో 9.9 శాతం వాటా లభించనుంది. ఈ ఒప్పందానికి ఆర్‌బిఐ, కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) ఆమోదం లభించాల్సి ఉందని ఎయు ఎస్‌ఎఫ్‌బి పేర్కొంది. తాజా పరిణామంతో ఫిన్‌కేర్ రూ.625 కోట్ల ప్రతిపాదిత ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్ నిలిచిపోనుంది.