Feb 15,2023 20:43

న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ముగింపు నాటికి ప్రభుత్వ రంగ టెలికం కంపెనీలు బిఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటిఎన్‌ఎల్‌ల విలీన ప్రక్రియ పూర్తి కావొచ్చని టెలికం శాఖ తెలిపింది. ఇందుకోసం న్యాయ సమస్యలను ఎదుర్కోవడానికి కన్సల్టింగ్‌ సంస్థ అడ్వైజర్‌ను నియమించుకోనున్నట్లు తెలిపింది. ఈ విలీన ప్రక్రియ ముందుకు సాగడానికి ఎంటిఎన్‌ఎల్‌ను డిలిస్టింగ్‌ను చేయనున్నట్లు పేర్కొంది. ఈ రెండు సంస్థలను విలీనం చేయడానికి దశాబ్ద కాలం నుంచి టెలికం శాఖ ప్రయత్నిస్తోంది. ఎంటిఎన్‌ఎల్‌ ప్రస్తుతం ఢిల్లీ, ముంబయిలో మొబైల్‌ నెట్‌వర్క్‌ సేవలనందిస్తుంది.