ఒక్కొక్క జ్ఞాపకం ఒక్కొక్క సందర్భం
అనేక సందర్భాల్లో అనేక ఘటనల సారాంశం
ఆనందాల సాగరం
విషాదాల విజయాన్ని సర్దుకొని
ప్రపంచం ఒక విలక్షణ మార్గదర్శి
ప్రపంచం ఒక దిక్సూచి
ప్రపంచం ఒక విజ్ఞాన వేదిక
ప్రపంచం ఒక విస్తృత వాహిక
జీవితాన్ని శాసించేది సంపద
జీవితం అనేక అనేక ఆటుపోట్ల మధ్య
నిరంతరం సాగిపోవడమే
మానవ జీవితానికి ఒక గమనం ఒక గమ్యం
నూతన విలువలను ప్రతిపాదించడమే
మానవీయమూర్తుల ఆకాంక్ష
అంతిమ విజయం నిరంతర ప్రగతి పథం
- డాక్టర్ సిహెచ్ ఆంజనేయులు
77025 37453










