హైదరాబాద్ : బెంగళూరు కేంద్రంగా పని చేస్తోన్న డయాగ్నొస్థిక్ సేవల సంస్థ అయిన మణిపాల్ హెల్త్‌మ్యాప్ తాజాగా హైదరాబాద్‌లోని మెడిక్స్ పాథ్‌ల్యాబ్స్‌ను స్వాధీనం చేసుకుంది. మెడిక్స్‌లో గతేడాది ఏప్రిల్‌లో 84 శాతం వాటాను రూ.100 కోట్లకు మణిపాల్ హెల్త్‌మ్యాప్ కొనుగోలు చేసింది. మిగిలిన 16 శాతం వాటాను తాజాగా కొనుగోలు చేసి.. సంస్థను పూర్తిగా చేజిక్కించుకుంది. దీంతో 16 రాష్ట్రాల్లో 100కు పైగా డయాగ్నొస్టిక్ సేవల కేంద్రాలతో సంస్థ సేవలు అందిస్తున్నట్లు అవుతుంది. దాదాపు 50 లక్షల మంది వినియోగదార్లకు సేవలు అందించే సామర్థ్యానికి చేరామని మణిపాల్ హెల్త్‌మ్యాప్ సిఇఒ సందీప్ శర్మ పేర్కొన్నారు.