హైదరాబాద్ : అతిపెద్ద బి2బి మెడికల్ ఉపకరణాల ట్రేడ్ ఫెయిర్ అయిన మెడీకాల్‌ను మార్చి 17 నుండి 19 వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించనున్నారు. మెడ్ ఎక్స్ప్‌ర్ట్ బిజినెస్ కన్సల్టెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ 32వ ఎడిషన్‌లో 10,000కి పైగా ఉత్పత్తులు, సేవలతో 300 ఎగ్జిబిటర్లు పాల్గొననున్నారని మెడీకాల్ వ్యవస్థాపకులు, సిఇఒ ఎస్ మణివణ్ణన్ పేర్కొన్నారు. ఇక్కడ సర్జికల్ కాటన్ నుండి అధునాతన ఇమేజింగ్ పరికరాలు, శస్త్ర చికిత్స ఉపకరణాల వరకు ఆసుపత్రుల్లో ఉపయోగించే అన్ని ఉత్పత్తులు ఇక్కడ ప్రదర్శనకు ఉంటాయని పేర్కొన్నారు.










