పల్లవి :
పేదల గుడిసెలపై ఎగిరే జెండమ్మా
బీదల బతుకులనే మార్చే పతాకమా
కూలీ నాలి పేదా రోదా
గుండె గుండెలో నీవమ్మా
ఓ... ఎర్రని జెండమ్మా
మా పేదల బతుకమ్మ... 2
చరణం 1 :
కార్మిక, కర్షక పోరాటాలకు
అండే నీవమ్మా..
కూడు గూడుకి జరిగే పోరులో
తోడున్నా వమ్మా ...
మా ఎర్రని జెండమ్మా .. మాపేదల బతుకమ్మా - 2
చరణం 2 :
మహిళలు మాన ప్రాణాలకు
రక్షణ నీవమ్మా
నిరుద్యోగుల ఉపాధి పోరులో
ముందున్నావమ్మా
మా ఎర్రని జెండమ్మా
మా బతుకుల తోడమ్మా ... 2
చరణం 3 :
విద్యా, ఉద్యోగ, ఉపాధ్యాయల
ఊపిరి నీవమ్మా
శ్రామిక జన బాంధవివై
ఎగిరే జెండమ్మా ..
మా ఎర్రని జెండమ్మా
మా ప్రాణం నీవమ్మా - 2
చరణం 4 ::
ప్రపంచ కార్మిక ఐక్యత కోసం
పరితపించినావే
దోపిడీ లేని రాజ్యం కోసం
పోరు సలిపినావే...
ఓ... ఓ... ఓ ...
ఎగిరే పతాకమా
మా ఎర్రని జెండమ్మా... 2
- రెడ్డి శంకరరావు
94943 33511










