Apr 29,2023 21:16

న్యూఢిల్లీ : టెక్‌ ఇన్నోవేషన్‌ స్టార్టప్‌ మ్యాటర్‌ డిజైన్‌ చేసిన దేశంలోనే తొలి గేర్డ్‌ విద్యుత్‌ మోటార్‌ బైక్‌ ఎరా ప్రీ బుకింగ్‌ కోసం ఫ్లిప్‌కార్డ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. వినియోగదారులు తమ మ్యాటర్‌ ఎరా మోటర్‌బైక్‌ను ముందస్తు బుకింగ్‌ చేసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుందని పేర్కొంది. ప్రత్యేక ఆఫర్ల ప్రయోజనాలను పొందే అవకాశం లభిస్తుందని తెలిపింది. దేశ వ్యాప్తంగా 25 జిల్లాలో 2వేలకు పైగా పిన్‌కోడ్స్‌లో ఎరా మోటార్‌ బైక్‌ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.