Oct 25,2023 16:20

వన్డే ప్రపంచకప్‌-2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాకు ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియా గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. హార్దిక్‌ కోలుకున్నప్పటికి టోర్నీ సెకెండాఫ్‌ను దృష్టిలో పెట్టుకుని జట్టు మేనెజ్‌మెంట్‌ విశ్రాంతి ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. అతడి స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్‌ను కొనసాగించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏలో ఉన్న పాండ్యా.. ఒకట్రెండు రోజుల్లో లక్నోలో జట్టుతో కలవనున్నాడు.