Apr 29,2023 21:28

న్యూఢిల్లీ : రైతు ఉత్పత్తి సంస్థ (ఎఫ్‌పిఒ)లకు, వ్యవసాయ ఎంఎస్‌ఎంఇలకు మద్దతునివ్వడానికి అగ్రిటెక్‌ వేదిక ఫామ్‌ పాస్‌ ద్వారా డిజిటల్‌ ఇన్‌వాయిస్‌ డిస్కౌంటింగ్‌ పరిష్కారాన్ని అందించడానికి ఎంవన్‌ఎక్సేంజీతో కలిసి పని చేయనున్నట్లు మాస్టర్‌కార్డ్‌ ప్రకటించింది. క్రెడిట్‌, వర్కింగ్‌ క్యాపిటల్‌కు సులభ యాక్సెస్‌ పొందేలా చేయడంతో పాటుగా, రైతులు, ఎఫ్‌పిఒలు నేరుగా కొనుగోలుదారులతో అనుసంధానం అవ్వడానికి, వారి ఉత్పత్తులకు ఉత్తమమైన ధరను చర్చించడానికి, చెల్లింపులు చేయడానికి, తక్షణమే చెల్లింపులు స్వీకరించడానికి మద్దతును ఇవ్వనున్నట్లు తెలిపింది. ఫామ్‌ పాస్‌ అనేది మాస్టర్‌ కార్డ్‌ విస్తృత కమ్యూనిటీ పాస్‌ ప్లాట్‌ ఫామ్‌లో ఓ భాగం.