Oct 13,2023 15:03

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఉద్యోగ్‌ నగర్‌ మెట్రో స్టేషన్‌ సమీపంలోని ప్లాస్టిక్‌ ఫ్యాక్టరీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫ్యాక్టరీలో మెల్లమెల్లగా రాజుకున్న మంటలు ఆ తర్వాత భారీగా ఎగిసిపడ్డాయి. ఫ్యాక్టరీ సిబ్బంది వెంటనే పోలీసులకు, ఫైర్‌ డిపార్టుమెంట్‌కు సమాచారం ఇచ్చారు.వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 26 ఫైరింజన్‌లతో మంటలను ఆర్పుతున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఆస్తి నష్టమే తప్ప ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.