
ముంబై : ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం మధ్యాహ్నం దాదాపు 12:30 నిమిషాల సమయంలో ముంబైలోని వెస్ట్ కాందివాలిలోని మహావీర్ నగర్‌లోని పవన్ ధామ్ వీణా సంతూర్ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ మహిళతో పాటుగా 8 సంవత్సరాల చిన్నారి మృతి చెందగా.. మరో 5 గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అయితే గాయపడిన 5 గురిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా ప్రమాదం జరిగిన భవనంలో నాలుగో అంతస్థులో ఐపీఎల్ క్రికెటర్ పాల్ చంద్రశేఖర్ వాల్తాటి ఇల్లు కూడా ఉంది. మృతి చెందిన ఇద్దరు చంద్రశేఖర్ ఇంటికి వచ్చిన అతిధులని.. వారు అమెరికా నుండి వచ్చారని స్థానికులు తెలిపారు. మంటలను 8 మంది అగ్నిమాపక సిబ్బంది సహాయంతో అదుపు చేస్తున్నట్లు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.