న్యూఢిల్లీ : ప్రముఖ యుటిఐ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ (యుటిఐ ఎఎంసి) భారీ విస్తరణను ప్రకటించింది. సెప్టెంబర్ 29న ఒకే రోజు 29 నూతన ఆర్థిక కేంద్రాలను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ నాలుగు శాఖలను తెరువనుంది. దేశ ఆర్థిక పరిశ్రమలో తమ కార్యకలాపాలను మరింత బలోపేతం చేస్తూ, పెట్టుబడిదారులకు మెరుగైన ఆర్థిక సేవలు అందించే లక్ష్యంతో ఈ అడుగు వేసినట్లు పేర్కొంది. రేపు ప్రారంభించిన శాఖల్లో తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం, కరీంనగర్, కర్నూల్, ఖమ్మం పట్టణాలు ఉన్నాయని తెలిపింది.