న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి దేశంలో 10 లక్షల యూనిట్ల ఆటోమెటిక్ వాహనాలను విక్రయించి.. నూతన మైలురాయిని చేరినట్లు వెల్లడించింది. ఇందులో ఆటోగేర్ షిప్ట్స్ (ఎజిఎస్), 4స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్, అడ్వాన్సుడ్ 6స్పీడ్ ఆటోమెటిక్ ట్రాన్స్‌మిషన్ (ఎటి) తదితర 16 మోడళ్లు ఉన్నాయని పేర్కొంది. 2014లో తొలిసారి ఎజిఎస్ టెక్నాలజీని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ప్రస్తుతం ఎంఎస్‌ఐఎల్ 65 శాతం ఆటోమెటిక్ వాహనాలను విక్రయిస్తుందని పేర్కొంది. పరిశ్రమలోని ఈ విభాగంలో 27 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నట్లు వెల్లడించింది.