Oct 27,2023 21:06

దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి 2023-24 సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో రికార్డ్‌ స్థాయిలో రూ.3,764.2 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. కమోడిటీ ధరలు తగ్గడానికి తోడు వ్యయాలు దిగిరావడం, విదేశీ మారకం సానుకూలతలు తదితర అంశాలు ఆకర్షణీయ ఫలితాలకు మద్దతునిచ్చాయని ఆ సంస్థ తెలిపింది. దేశీయంగా కార్ల అమ్మకాలు 6.3 శాతం పెరిగి 4,82,731 యూనిట్లుగా నమోదయ్యాయి. ఎగుమతులు 9.7 శాతం వృద్థితో 69,324 యూనిట్లుగా చోటు చేసుకున్నాయి. కంపెనీ మొత్తం ఆదాయం 24.1 శాతం పెరిగి రూ.30,541 కోట్లకు చేరింది. ఇదే సమయంలో కంపెనీ మొత్తం వ్యయం 18.6 శాతం పెరిగి రూ.27,925 కోట్లుగా నమోదయ్యింది.