న్యూఢిల్లీ : సెకెండ్ హ్యాండ్ కార్లను అమ్మకాలను చేసే మారుతి సుజుకి ట్రూ వాల్యూ ఇప్పటి వరకు 50 లక్షల యూనిట్లను విక్రయించినట్లు ప్రకటించింది. 2001లో ఈ రంగంలో అడుగుపెట్టిన తమ సంస్థకు ఇదో నూతన మైలురాయి అని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవా పేర్కొన్నారు. 22 ఏళ్లలోనే ఈ విభాగంలో 50 లక్షల కొనుగోలుదారులను సొంతం చేసుకున్నామన్నారు. మారుతి సుజుకి ట్రూ వాల్యూ 281 నగరాల్లో కార్యకలాపాలను కలిగి ఉంది.










