న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి మార్కెట్లోకి తన కొత్త ఎస్‌యువి 'ఫ్రాంక్స్' మోడల్‌ను విడుదల చేసింది. ఎక్స్‌షోరూం వద్ద దీని ధరల శ్రేణీని రూ.7.47 లక్షల నుంచి రూ.13.14 లక్షలుగా నిర్ణయించింది. ఇందులో ఫ్రాంక్స్ సిగ్మా, డెల్టా, డెల్టాం, జీటా, ఆల్ఫా అనే వేరియంట్లు ఉన్నాయి. 1.0 లీటర్, 1.2 లీటర్ ఇంజిన్ సామర్థ్యంతో వీటిని డిజైన్ చేసింది. రూ.11,000తో ముందస్తు బుకింగ్స్‌ను స్వీకరిస్తున్నట్లు తెలిపింది. త్వరలోనే డెలివరీలను ప్రారంభించనున్నట్లు పేర్కొంది.










