May 07,2023 09:07

సీజనల్‌గా దొరికే కొన్ని కాయలు, కూరగాయలు వేసవిలో కొన్నిరోజులు మాత్రమే దొరికేవి పూర్వం. అన్‌సీజన్‌లోనూ తినాలంటే..? ఈ ప్రశ్న ఉద్భవించి, దానికి సమాధానంగా వచ్చినవే ఈ ఒరుగులు. ఇప్పుడు మిగిలిన రోజుల్లో ఏడాదంతా హైబ్రిడ్‌ రకాలు దొరుకుతున్నాయి. దేశీయ రకాలకు ఉండే రుచి హైబ్రిడ్‌ రకాలకు ఉండదు. అయినా కాస్త, ఓపిక, సమయం కేటాయిస్తే సంవత్సరమంతా రుచికరమైన ఆహారం తీసుకోవచ్చు కదా! దాని కోసమే ఇప్పుడు కొన్ని రకాల ఒరుగులను తయారుచేసుకొనే విధానం, వాటిని నిలవ ఉంచుకుని, వాడుకునే విధానాలు తెలుసుకుందాం.

  • మామిడికాయ..

కావలసినవి : మామిడికాయలు - 2, ఉప్పు - స్పూను, పసుపు - స్పూను
తయారీ : శుభ్రం చేసిన మామిడి కాయలు పెచ్చు తీసి, చిన్న ముక్కలుగా తరగాలి. వాటిని వెడల్పు గిన్నెలో తీసుకొని ఉప్పు, పసుపు బాగా పట్టించి, మూడు రోజులు పలుచగా ఎండబెట్టాలి. విరిపితే ఇరిగేంతగా ఎండిన ముక్కలను గాలి చొరబడని డబ్బాలో నిలువ పెట్టుకుంటే ఏడాదంతా ఉపయోగించుకోవచ్చు. ఈ ఒరుగులతో అన్‌సీజన్‌లో కూడా పచ్చిమామిడితో చేసుకునే వంటలు తయారుచేసుకోవచ్చు. ఇదే ముక్కలను మెత్తగా మిక్సీ పట్టి స్నాక్స్‌లో ఆమ్‌చూర్‌గా ఉపయోగించుకోవచ్చు.
,

  • కాబేజీ,మ్యాన్‌గొ ఫ్రూట్‌,సపోట,టమోటా, కాకర
vadiyalu

టమోటా, కాబేజీ, కాలీఫ్లవర్‌, కాకర, దోస, వంకాయ మొదలైనవి ఇలాగే బాగా ఎండిపోయేలా చేసి, గాలి చొరబడని డబ్బాలో నిల్వ ఉంచుకొని, వాడుకునేటప్పుడు తడి తగలకుండా జాగ్రత్త పడితే సంవత్సరమంతా నాటు రకం కూరలు చేసుకునే అవకాశం ఉంది.
ఇప్పటి వరకూ కూరలకు సంబంధించిన ఒరుగులే తెలుసుకున్నాం. కానీ పండ్లలో రారాజు మామిడి పండు అనేది అందరికీ తెలిసిందే. మరి మామిడి పండును కూడా మళ్ళీ వేసవి వరకూ వేచి ఉండకుండా మధ్యలోనూ జిహ్వచాపల్యం తీర్చుకునేలా ఎలా ఒరుగులుగా తయారు చేసుకోవచ్చునో చూద్దాం.
బంగినపల్లి, చసేరి, కేసరి, ఆమ్రపాలి రకాల మామిడి పండ్లు శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడవాలి. పైపెచ్చు తీసి పలుచని ముక్కలుగా కట్‌ చేసుకొని, ఐదు రోజులపాటు ఎండబెట్టుకోవాలి. ముక్కలుగా కోసేటప్పుడు చెదిరిపోకుండా ఉండేలా కొంచెం గట్టిగా ఉన్న కాయలతోనే ఒరుగులు తయారుచేసుకోవాలి. వీటిని గాజు సీసాలో నిల్వ పెట్టుకోవచ్చు. ఫ్రిజ్‌లో పెట్టుకుంటే రంగు, రుచి మారదు. మామిడి పండ్ల ఒరుగులు పండు రూపంలో కంటే ఒరుగులే మరింత తియ్యదనాన్ని సంతరించుకుని, రుచిగా ఉంటాయి.

  • ఉసిరి ..
2

కావలసినవి : ఉసిరి కాయలు - కేజీ, ఉప్పు - స్పూను, పసుపు - స్పూను
తయారీ : శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడిచిన ఉసిరికాయలను తొనలు తొనలుగా కట్‌ చేసి, ఉప్పు, పసుపు కలిపి ఎండలో పలుచగా ఎండబెట్టాలి. పెళపెళలాడేలా ఎండిన ముక్కలను గాలి చొరబడని డబ్బాలో నిలువ పెట్టుకుని, సంవత్సరమంతా ఉపయోగించుకోవచ్చు.