May 23,2023 17:14

ప్రజాశక్తి - మార్టూరు రూరల్‌(బాపట్ల) : యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మంగళవారం విడుదల చేసిన సివిల్స్‌ ఫలితాలలో మార్టూరు పట్టణానికి చెందిన వీరగంధం లక్ష్మి సుజిత 311 ర్యాంకు సాధించి మండలంలోనే టాపర్‌గా నిలిచింది. స్థానిక శ్రీ శ్రీనివాస విద్యాసంస్థల అధినేత వీరగంధం శ్రీనివాస్‌, భవాని దంపతుల కుమార్తె అయిన సుజిత మార్టూరులోని శ్రీనివాస హై స్కూల్‌లో 10వ తరగతి విద్య అభ్యసించి 9.8 జిపిఎ సాధించి మండలంలోనే టాపర్‌ గా నిలించింది. అనంతరం రాయల్‌ జూనియర్‌ కాలేజ్‌లో ఇంటర్‌ మీడియట్‌ 982 మార్కులు సాదించి టాపర్‌గా నిలిచింది. తమిళనాడు రాష్ట్రం తంజావూర్‌ శస్త్ర యూనివర్సిటీ నందు కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచ్‌లో 9. 4 స్కోర్‌ సాధించి యూనివర్సిటీ లో బ్రాంచ్‌ టాపర్‌గా నిలిచింది. అనంతరం సాఫ్ట్‌ వెర్‌ ఇంజనీర్‌ గా పనిచేస్తూ సివిల్స్‌ పై మక్కువతో ఉద్యోగానికి రాజీనామా చేసి పట్టుదలతో కోచింగ్‌ తీసుకొని సివిల్స్‌ లో 311 రాంక్‌ సాధించింది. ఈ సందర్బంగా మార్టూరు రాయల్‌ విద్యాసంస్థల అధినేత పేరం రవీంద్రబాబు,ఇంచార్జి కుడారి మధుబాబు,శ్రీనివాస విద్యాసంస్థల సిబ్బంది వీరగంధం శ్రీ లక్ష్మి సుజితను అభినందించారు.