Oct 30,2023 09:52

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విజయనగరం జిల్లా రైలు ప్రమాదం నేపథ్యంలో వాల్తేరు రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దు, ఇంకొన్ని దారి మళ్లింపు చర్యలను రైల్వే శాఖ చేపట్టింది. ఆదివారం రాత్రి 11.15 గంటలకు రైల్వే శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం... రాయపూర్‌- విశాఖపట్నం పాసింజర్‌ (08527) ఈ నెల 30న రాయపూర్‌లో బయల్దేరాల్సి ఉండగా రైలు రద్దయ్యింది. విశాఖ నుంచి రాయపూర్‌ పాసింజర్‌ (08528)ను కూడా రద్దు చేశారు.
 

                                                                           దారి మళ్లించిన రైళ్లు ఇవే..

టిట్లాగర్‌-రాయపూర్‌-నాగ్‌పూర్‌-విజయవాడ రెగ్యులర్‌గా తిరిగే రైలును, బారుని-కోయంబత్తూరు స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ (03357) రైలును, రైలు నెంబరు (18189) టాటా-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌ 29న తిరగాల్సిన రైలును దారి మళ్లించారు. ట్రైన్‌ నెంబరు 11020 భువనేశ్వర్‌ - సిఎస్‌టి ముంబయి-కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ భువనేశ్వర్‌లో 29న బయల్దేరాల్సి ఉంది. దాన్నీ దారి మళ్లించారు. రైలు నెంబరు 12703 హౌరా-సికింద్రాబాద్‌ ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ హౌరాలో 29న బయల్దేరాల్సి ఉంది. దాన్నీ దారి మళ్లించారు. రైలు నెంబరు 12245 హౌరా-బెంగళూరు దురంతో ఎక్స్‌ప్రెస్‌ 29న హౌరాలో బయలుదేరాల్సి ఉంది. దాన్నీ దారి మళ్లించారు.
రైళ్ల షార్ట్‌ టెర్మినేషన్‌ : రైలు నెంబరు 20809 సంబల్‌పూర్‌- నాందేడ్‌ రైలు సంబల్‌పూర్‌లో 29న బయల్దేరింది. దీన్ని విజయనగరంలో ఆపేశారు. విజయనగరం-సంబలపూర్‌కు దీన్ని నడుపుతారు. రైలు నెంబరు 17479 పూరీ-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ పూరీలో ఈ నెల 29న బాలుగాన్‌లో నిలుపుదల చేశారు. పూరికి ఇది రావాల్సి ఉంది. విశాఖపట్నం- విజయనగరం ట్రైన్‌ విశాఖలో ఆదివారం బయదేరాల్సి ఉండగా దాన్ని పెందుర్తిలో ఆపేశారు. రైలు నెంబరు 11020 సిఎస్‌టి ముంబయి-భువనేశ్వర్‌ కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ సిఎస్‌టి ముంబయిలో 28న బయలుదేరింది. దీన్ని విశాఖపట్నంలో నిలిపివేశారు.