Jul 27,2023 15:15

హైదరాబాద్‌: భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హసన్‌పర్తి - కాజీపేట మార్గంలో రైల్వే ట్రాక్‌పై భారీగా వర్షపు నీరు నిలవడంతో.. మూడు రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపింది. 9 రైళ్లను దారి మళ్లించినట్లు వెల్లడించింది. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ - సికింద్రాబాద్‌ (17012), సికింద్రాబాద్‌ - సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ (17233), సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ - సికింద్రాబాద్‌ (17234) రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. తిరుపతి - కరీంనగర్‌ (12761), కరీంనగర్‌ - తిరుపతి (12762), సికింద్రాబాద్‌ - సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ (12757), సిర్పూర్‌ కాగజ్‌ నగర్‌ - సికింద్రాబాద్‌ (12758) రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు తెలిపింది.