Oct 03,2023 20:55

న్యూఢిల్లీ : ప్రస్తుత ఏడాది సెప్టెంబర్‌లో తయారీ రంగం ఐదు నెలల కనిష్టానికి పడిపోయింది. గడిచిన నెలలో మాన్యుఫాక్చరింగ్‌ పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌ (పిఎంఐ) 57.5కు తగ్గిందని ఎస్‌అండ్‌పి గ్లోబల్‌ తెలిపింది. ఇంతక్రితం ఆగస్ట్‌లో ఇది 58.6గా నమోదయ్యింది. ఈ సూచీ 50పైనా ఉంటే వృద్థిగా.. దిగువన ఉంటే క్షీణతగా పరిగణిస్తారు. పడిపోతే ప్రతికూలతలో ఉన్నట్లు. ద్రవ్యోల్బణం కొంత తగ్గినప్పటికీ దీర్ఘకాల దృష్టితో విశ్లేషిస్తే.. గరిష్టంగానే ఉందని ఎస్‌అండ్‌పి పేర్కొంది. ఇది అమ్మకాల అవకాశాలను దెబ్బతీస్తుందని హెచ్చరించింది. కొత్త ఎగుమతి ఆర్డర్లు గరిష్ట స్థాయి నుంచి తగ్గిపోయాయని పేర్కొంది.