May 23,2023 11:01

పండు పండు మామిడి పండు
వేసవిలో దొరికే పండు
పిల్లలు పెద్దలు మెచ్చే పండు
అందరికి తెగ నచ్చే పండు
బంగినపల్లి మామిడి పండు
పసుపు రంగులో ఉండే పండు
కొరికి తింటే కమ్మగ ఉండు
జ్యూసు తాగితే తియ్యగా ఉండు
అందరం తిందాం...ఆరోగ్యంగా ఉందాం.

- నీలం అభిజ్ఞ,
5వ తరగతి,
శ్రీ చైతన్య స్కూలు,
నంద్యాల.