ప్రజాశక్తి-మంగళగిరి రూరల్ (గుంటూరు) : మంగళగిరిలో ది మంగళగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ కార్యాలయంలో సోమవారం సంఘం నూతన పాలకవర్గ చైర్మన్‌గా నియమితులైన ఆర్ల బ్రహ్మయ్య, డైరెక్టర్లుగా సుంకర సుబ్బారావు, కర్రీ మరియదాసు ప్రమాణ స్వీకారం చేశారు. పిఏసిఎస్ సొసైటీ సెక్రటరీ రాయల్ రమేష్ చైర్మన్ బ్రహ్మయ్య, డైరెక్టర్లచే ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యఅతిథిగా వైసిపి నియోజకవర్గ పరిశీలకులు నిమ్మకాయల రాజనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజనారాయణ మాట్లాడుతూ.. నీతికి నిజాయితీకి మారుపేరైన ఎమ్మెల్యే ఆర్కే నాయకత్వంలో సొసైటీ పాలకవర్గం పనిచేయడం అదృష్టంగా భావించాలన్నారు. ఆర్కే ఎంతో ఆశయంతో అయితే పదవులు ఇచ్చారో ఆ పదవులకు వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని ఆయన సూచించారు. సొసైటీని నియోజకవర్గంలోనే మోడల్‌గా చేసి మంచిపేరు తెచ్చుకోవాలన్నారు. నాయకత్వాన్ని పెంపొందించుకోవడానికి పాలకవర్గానికి తొలిమెట్టుగా భావించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ మునగాల భాగ్యలక్ష్మి, దుగ్గిరాల ఎంపీపీ దానబోయిన సంతోష రూపవాణి, మాజీ ఏఎంసీ చైర్మన్లు సుంకర రఘుపతిరావు, దొడ్డక శివపార్వతి, వైసిపి పట్టణ అధ్యక్షులు మునగాల మల్లేశ్వరరావు, నాయకులు దానబోయిన వెంకటేశ్వరరావు అన్నపరెడ్డి బ్రహ్మర్గనరెడ్డి, సంకే సునీత ఆదిన సతీష్ యాదవ్, ఆర్ల సూర్య బ్రహ్మేశ్వరరావు, ఆర్ల రామయ్య, దొడ్డక కృష్ణ, తాడిబోయిన సురేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.










