హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారీ విస్తరణపై దృష్టి కేంద్రీకరించినట్లు మలబార్ గోల్డ్ అండ్ డైమాండ్స్ వెల్లడించింది. వచ్చే మార్చి ముగింపు నాటికి భారత్‌లో కొత్తగా 32, విదేశాల్లో 12 షోరూంలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. 2025 మార్చి ముగింపు నాటికి రూ.1,000 కోట్ల పెట్టుబడులతో 4,000 ఉద్యోగాలను సృష్టించాలని నిర్దేశించుకున్నామని మలబార్ గ్రూపు ఛైర్మన్ ఎంపి అహ్మద్ తెలిపారు. సంస్థ 30 ఏళ్ల ప్రస్థాన వేడుకలు జరుపుకుంటున సందర్బంగా ముంబయిలో మలబార్ నేషనల్ హబ్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మలబారు చరిత్రలో ఇదొక గొప్ప మైలురాయి అని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా తమకు 190మేర రిటైల్ షోరూంలు ఉన్నాయన్నారు.