హైదరాబాదు సిటీ కాలజీ మఖ్దూమ్ మొహియుద్దీన్ జాతీయ పురస్కార (2022, 2023) ప్రదానోత్సవ సభ మఖ్దూమ్ జయంతి సందర్భంగా ఫిబ్రవరి 4 శనివారం ఉదయం 10.30 గంటలకు కళాశాల గ్రేట్ హాల్లో జరుగుతుంది. 2022 పురస్కారం జయరాజుకు, 2023 పురస్కారం కె.శ్రీనివాస్‌కు ప్రదానం చేస్తారు. పురస్కార గ్రహీతలకు ప్రశంసాపత్రంతో పాటు జ్ఞాపిక, రూ.10 వేల నగదు అందజేస్తారు. కళాశాల ప్రిన్సిపాల్ డా.బాలభాస్కర్ అధ్యక్షతన జరిగే సభలో ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మీడియా అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య తంగెడ కిషన్ రావు, డా.యాకూబ్ అతిథులుగా పాల్గొంటారు.










