
ప్రజాశక్తి-రైల్వేకోడూరు(అన్నమయ్యజిల్లా) : ఈనెల 29వ తేదీన విజయవాడలో జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం జయరామయ్య పిలుపునిచ్చారు. ఓబుళవారి పల్లె మండలంలో వ్యవసాయ కార్మిక సంఘం,(ఏఐఏడబ్ల్యుయు) కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కె.వి.పి.ఎస్) సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 29వ తేదీన విజయవాడలో జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాలని కోరుతూ తహశీల్దారు కార్యాలయం ముందు ధర్నాకు సంబంధించి గోడ పత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులునాగిపోగు పెంచిలయ్య,రైతు సంఘం నాయకులు సి.హరి,సీటు రమణ భవన నిర్మాణ శాఖ నాయకులు చెన్నకేశవులు,పందెటి శివ కుమార్ రాజు, గిరిజన నాయకులు సుబ్బు రఘువలు కార్యకర్తలు పాల్గొన్నారు.