- సీఆర్పీఎఫ్ కమాండెంట్ రాజేష్ కుమార్
ప్రజాశక్తి-కలికిరి(అన్నమయ్యజిల్లా): రాష్ట్రీయ ఏక్తా దివస్ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని సీఆర్పీఎఫ్ కమాండెంట్ రాజేష్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా సీఆర్పీఎఫ్ జవాన్లు కలికిరి క్రాస్ రోడ్‌లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం రాజేష్ కుమార్ మాట్లాడుతూ అక్టోబర్ 31 సోమవారం సర్దార్ వల్లభారు పటేల్ జయంతి పురస్కరించుకుని సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఐక్యత దినోత్సవంను పాలెం కొండ సమీపంలోని సిఆర్పిఎఫ్ కార్యాలయంలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యమ్రంలో ప్రజలందరూ పాల్గొనివిజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సెకండ్ కమాండెంట్ కే సి నిర్మల్, డిప్యూటీ కమాండెంట్‌లు ఏ కే సింగ్, నిషా, నాందేశ్వర్, రవి కుమార్, కదిరి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.










