Aug 28,2023 12:16

శ్రీకాకుళం : జీడి రైతులకు మద్దతుగా ... కంచిలి మండల కేంద్రంలో జీడి రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం బైక్‌ ర్యాలీ ప్రారంభించారు. కంచిలి, సోంపేట, కవిటీ, మందస, పలాస మండలాల్లో ఈ ర్యాలీ కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో జీడి రైతు సంఘం కన్వీనర్‌ అజరు కుమార్‌, రైతు సంఘం నాయకులు కే.మోహన్‌ రావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.