Dec 17,2022 12:28

విశాఖ : డిసెంబర్‌ 18, 19 తేదీల్లో పరవాడలో జరగనున్న సిఐటియు 12 వ మహాసభలను జయప్రదం చేయాలని శనివారం సినిమా హాల్‌ సెంటర్‌ లో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.శంకర్రావు మాట్లాడుతూ ... సిఐటియు మహాసభలు పారిశ్రామిక ప్రాంతం పరవాడలో ఘనంగా జరగనున్నాయని మహాసభలు ప్రారంభ సూచికంగా 18వ తేదీన భారీ బహిరంగ సభ ఎంఆర్‌ఓ ఆఫీసు నుండి ప్రారంభం అవుతుందని చెప్పారు. ఈ మహాసభల్లో కార్మిక సమస్యలు, ప్రభుత్వ విధానాలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తారని, 24 మండలాల నుండి 20 రంగాల నుండి ఈ ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. బహిరంగ సభకు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌ నరసింహ రావు హాజరు కానున్నారని, కార్మికులందరూ ఈ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ, మండల నాయకులు ఎడ్ల బాబ్జి, మండల కఅష్ణ, కన్నూర్‌ నాయుడు, గేదెల అప్పారావు, సిహెచ్‌.ఎర్రి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.