May 29,2023 13:48

భోగాపురం (విజయనగరం) : విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో వైసిపి నాలుగేళ్ల పాలనకు మద్దతుగా నెల్లిమర్ల ఎమ్మెల్యే బొడ్డుకొండ అప్పలనాయుడు ఆధ్వర్యంలో భారీ బైక్‌ ర్యాలీ నిర్వహించారు. భోగాపురం మండలం మహారాజుపేట జంక్షన్‌ నుండి పోలిపల్లి, సవరవల్లి, ఏ.రావివలస, భోగాపురం వరకు జాతీయ రహదారి సర్వీస్‌ కూడలి వరకు ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ ... ఎన్ని అడ్డంకులు వచ్చినా సంక్షేమ పథకాలను ఆపకుండా ముందుకు సాగిస్తున్న ఘనత జగన్మోహన్‌ రెడ్డికే దక్కుతుందని, టిడిపి ఎన్ని అడ్డంకులు పెట్టిన ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే విధంగా ముందు సాగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్‌ సూర్యనారాయణ, హౌసింగ్‌, మత్స్యకార కార్పొరేషన్‌ డైరెక్టర్లు శివారెడ్డి, మైలపల్లి నరసింహులు, కర్రోతు వెంకటరమణ, శ్రీనివాసరావు, విజయభాస్కర్‌ రెడ్డి, పట్న తాతయ్యలు, వైస్‌ ఎంపీపీ రావాడబాబు, ఎంపీటీసీలు, సర్పంచులు, ముఖ్య నేతలంతా పాల్గొన్నారు.