Feb 15,2023 20:47

న్యూఢిల్లీ : ప్రముఖ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ కంపెనీ మేక్‌ మై ట్రిప్‌ పెళ్లైన దంపతుల కోసం 300 పైగా కస్టమైజ్డ్‌ హనీమూన్‌ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా 26 గమ్యస్థానాలు ఉన్నాయని పేర్కొంది. ఇందులో విభిన్నరకాల బడ్జెట్‌ ప్యాకేజీలున్నాయని పేర్కొంది. దేశీయంగా రూ.24,999 నుంచి, అంతర్జాతీయంగా రూ.44,999 నుంచి ప్యాకేజీలు ప్రారంభమవుతాయని పేర్కొంది.