Oct 08,2023 15:34

ప్రజాశక్తి-పుట్లూరు(అనంతపురం): అడవి ఆవులు మొక్కజొన్న పంటపై విరుచుక్కపడడంతో వేసిన పంట అంతా ధ్వంసం అయింది. వివరాల్లోకెళితే ఎస్‌ గూడూరు గ్రామానికి చెందిన వాసుదేవ రెడ్డి తనకున్న నాలుగు ఎకరాల 20 సెంట్లు భూమిలో మొక్క జొన్న పంటను సాగు చేశారు. పంట కోసం లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెట్టారు. నెల రోజులకు పంట వస్తుందని పెట్టుబడి పోయి ఒకటిన్నర లక్ష వరకు మిగులుతుందని అనుకునే లోపల ఒకసారిగా 70 ఆవులు మొక్కజొన్న పంటపై పడడంతో మొత్తం పంట అంతా ధ్వంసం అయ్యిందని దీంతో లాభం దేవుడు ఎరుగని పెట్టిన పెట్టుబడి కూడా పోయిందని రైతు వాసుదేవ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి పంట నష్టపరిహారాన్ని దించాలని లేకపోతే ఆత్మహత్యే శరణమని రైతు వాపోయాడు. వెంటనే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని కోరుతున్నాడు.