ముంబయి : మహీంద్రా అండ్ మహీంద్రా గౌరవ ఛైర్మన్ కేషుబ్ మహీంద్రా మరణించారు. 99 ఏళ్ల కేషుబ్ బుధవారం ముంబయిలో కన్నుమూశారు. 1947లో మహీంద్రా గ్రూప్‌లో చేరిన కేషుబ్ 48 సంవత్సరాల పాటు కంపెనీకి చైర్మన్‌గా నాయకత్వం వహించారు. ప్రస్తుత ఎంఅండ్‌ఎం ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాకు మేనమామ అవుతారు. 1963 నుంచి 2012 వరకు ఛైర్మన్‌గా కొనసాగి.. అనంతరం తన వారసుడిగా మేనల్లుడు ఆనంద్ మహీంద్రాకు తన బాధ్యతలను అప్పగించారు. మహీంద్రా గ్రూపును వాహన రంగం నుంచి సాఫ్ట్‌వేర్, రియాల్టీ, రక్షణ, ఇంధన తదితర బహుళ రంగాల్లోకి విస్తరించిన ఘనత కేషుబ్‌దే.










