Sep 22,2023 21:20

న్యూఢిల్లీ : కెనడాలోని మహీంద్రా అండ్‌ మహీంద్రా అనుబంధ సంస్థ రెస్సన్‌ ఏరోస్పేస్‌ కార్పొరేషన్‌ కార్యకలాపాలను స్వచ్ఛందంగా రద్దు చేసుకుంది. తమ సంస్థను మూసివేస్తున్నట్లు ఆ సంస్థ కెనడా కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకోగా.. సెప్టెంబర్‌ 20న ఆమోదం లభించింది. ఈ విషయాన్ని ఎంఅండ్‌ఎం గురువారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ప్రకటించింది. దీంతో శుక్రవారం ఎంఅండ్‌ఎం షేర్లు 3 శాతం పతనమై రూ.1583.80 వద్ద ముగిసింది. సంస్థ మార్కెట్‌ కాపిటలైజేషన్‌ రూ.7200 కోట్లు ఆవిరయ్యింది. ఎంఅండ్‌ఎంకు రెస్సన్‌లో 11.18 శాతం వాటాలున్నాయి. మూసివేతకు గల కారణాలను మాత్రం ఎంఅండ్‌ఎం వెల్లడించకపోవడం గమనార్హం.