Apr 12,2023 18:52

ముంబై: మహీంద్రా అండ్‌ మహీంద్రా ఎమెరిటస్‌ మాజీ చైర్మన్‌ కేషుబ్‌ మహీంద్రా (99)బుధవారం కన్నుమూశారు. ముంబైలోని తన నివాసంలోనే తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. కేషుబ్‌ 1947లో కంపెనీలో చేరారు. 1963లో ఆ కంపెనీకి ఛైర్మన్‌ అయ్యారు. ఈయన మృతికి పలువురు సంతాపం తెలిపారు. భారతీయ ఆటోమొబైల్‌ పరిశ్రమ తన మార్గదర్శకుల్లో ఒకరిని కోల్పోయిందని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ (సియామ్‌) అధ్యక్షుడు వినోద్‌ అగర్వాల్‌ అన్నారు. ఈయన మృతికి ఆయన సంతాపం తెలియజేశారు.