Aug 30,2023 13:09

పూనె (మహారాష్ట్ర) : మహారాష్ట్రలోని పూనె జిల్లాలో ఎలక్ట్రిక్‌ హార్డ్‌వేర్‌ షాపులో బుధవారం ఉదయం అగిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పూనె జిల్లాలోని పింప్రి చించ్వాడ్‌లోని పూర్ణానగర్‌ ప్రాంతంలోని ఎలక్ట్రిక్‌ హార్డ్‌వేర్‌ షాప్‌లో బుధవారం ఉదయం తెల్లవారుజామున ఐదుగంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదం వల్ల నలుగురు మృతి చెందారని పింప్రి చించ్వాడ్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ యొక్క అగ్నిమాపక విభాగ అధికారిక తెలిపారు. మంటల్లో షాపు పూర్తిగా దగ్ధమైనట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. అయితే షాపులో అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియలేదని అధికారులు పేర్కొన్నారు.