భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వచ్చే నెల నవంబర్ 17న జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలకు హామీల వర్షం కురిపించింది. దాదాపు 59 106 పేజీల ఎన్నికల మేనిఫెస్టోను మధ్యప్రదేశ్ పీసీసి అధ్యక్షుడు కమల్‌నాథ్ మంగళవారం విడుదల చేశారు. అన్ని వర్గాల ప్రజలకు లబ్ధిచేకూర్చే లక్ష్యంలో భాగంగానే మేనిఫెస్టోను రూపొందించినట్లు కమల్‌నాథ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే గ్యాస్ సిలిండర్ రూ.500లకు అందజేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. రైతలకు రెండు లక్షల రూపాయల మేర రుణ మాఫీ, అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ. 1500 భృతి ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంది. అలాగే పది లక్షల రూపాయల మేర ప్రమాద బీమా, ఉచితంగా పాఠశాల విద్య, నిరుద్యోగ యువతకు వారి అర్హతను బట్టి నెలకు 1.500 నుంచి రూ.3 వేల వరకు రెండేళ్లపాటు నిరుద్యోగ భృతి, ఉద్యోగులకు పాత పెన్షన విధానాన్నే అమలు చేయనున్నట్లు కాంగ్రెస్ మేనిఫెస్టోలో వెల్లడించింది. అలాగే ప్రతి ఒక్కరికీ రూ. 25 లక్షల ఆరోగ్య బీమా, ఓబిసీలకు 27 శాతం రిజర్వేషన్ వంటి హామీలనిచ్చింది. ఐపీఎల్ జట్టు ఏర్పాటు సహా మొత్తంగా ఈ ఎన్నికల సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ 59 హామీలనిచ్చింది.










