Feb 27,2023 07:24

మార్చి 5వ తేదీ ఆదివారం ఉదయం 11.30 గంటలకు మధునాపంతుల ఫౌండేషన్‌ స్కూలు, పల్లిపాలెంలో జరిగే సభలో ప్రసిద్ధ కథకులు అనామకుడు, దాట్ల దేవదానం రాజు, ముక్కామల చక్రధర్‌లకు మధుశ్రీ కథా గౌరవ పురస్కారాలు అందజేస్తారు. గౌరవ పారితోషికం రూ.20 వేలు, రూ.10 వేలు నగదు, సత్కారం, జ్ఞాపిక అందిస్తారు. మధునాపంతుల సత్యనారాయణ మూర్తి అధ్యక్షతన జరిగే సభలో డా. సీతారాం, అద్దేపల్లి ప్రభు, అవధానుల మణిబాబు పుస్తక సమీక్ష చేస్తారు..