ధిక్కార కవి మద్దూరి నగేష్ బాబు జనవరి 10న వర్థంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కవిత్వానికి పురస్కారాలు ఇవ్వదలిచాము. ప్రధాన పురస్కారానికి రూ.5 వేలు, మరో మూడు ప్రోత్సాహక పురస్కారాలకు వేయి చొప్పున నగదు బహుమతి, జ్ఞాపిక, సత్కారం వుంటాయి. కవులు 2020 - 22 మధ్య ప్రచురించిన తమ కవితా సంపుటాలను 4 కాపీలు డిసెంబర్ 20 లోగా ఈ కింది చిరునామాకు పంపాలి. జనవరి 10న విజయవాడలో పురస్కార ప్రదాన సభ వుంటుంది. పుస్తకాలు పంపాల్సిన చిరునామా : కన్వీనర్, తంగిరాల సోని, ఇంటి నెం. 12-45/1, జెడ్పీ హైస్కూలు దగ్గర, కంచికచర్ల (పోస్ట్, మండలం), ఎన్టీఆర్ జిల్లా - 521 180. సెల్ : 96766 09234










